తగ్గిన వాట్సాప్‌ వీడియో స్టేటస్‌ నిడివి.. ఎన్ని సెకన్లో తెలుసా..!

By అంజి  Published on  30 March 2020 9:57 AM GMT
తగ్గిన వాట్సాప్‌ వీడియో స్టేటస్‌ నిడివి.. ఎన్ని సెకన్లో తెలుసా..!

హైదరాబాద్‌: 'వాట్సాప్‌ వీడియో స్టేటస్‌ ఇక 15 సెకన్లే' అంటూ ఓ పత్రిక కథనం రాసింది. భారత్‌లో కరోనా వైరస్‌ కట్టడి కోసం లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో ప్రజలందరూ కూడా పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. వీరిలో కొంత మంది ఇంటి పని చక్కబెట్టుకుంటే, మరి కొందరు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం కాలక్షేపం కోసం ఇంటర్‌నెట్‌ బాగా వాడుతున్నారట. ఆన్‌లైన్‌ వినియోగం భారీగా పెరగడంతో ఇంటర్‌నెట్‌ వేగం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ సోషల్‌ మీడియా యాప్‌ వాట్సాప్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇంట్లో ఏమి చేయాలో తోచక నెటిజన్లు వాట్సాప్‌ స్టేటస్‌లో వీపరితంగా వీడియోలు అప్‌లోడ్‌ చేస్తున్నారట. దీంతో ప్రస్తుతం 30 సెకన్లుగా ఉన్న స్టేటస్‌ వీడియోల నిడివిని 15 సెకన్లకు తగ్గించింది. ఈ విషయాన్ఇన వాబీటాఇన్‌ఫో తెలిపింది. అయితే భారత వాట్సాప్‌ యూజర్లకు మాత్రమే వర్తంచనుంది. వాట్సాప్‌ స్టేటస్‌లో వీడియోలు ఎక్కువ సంఖ్యలో అప్‌లోడ్‌ చేయడం వల్ల సర్వర్లపై విపరీతమైన భారం పడుతోందని, అందువల్లే వాట్సాప్‌ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.

Also Read: క‌రోనా బాధితుల కోసం విరాట్ సాయం.. ఎంతిచ్చాడంటే..?

ఇంటర్‌నెట్‌ని అధికంగా వినయోగించడం వల్ల దాని వేగం తగ్గుతుందని తెలుస్తోంది. దీని వల్ల ఇతర ముఖ్యమైన పనులు జరగడానికి అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నాయి. నెటిజన్లు అధికంగా నెట్‌ వాడుతున్నారన్న విషయాన్ని గుర్తించిన ప్రముఖ స్ట్రీమింగ్‌ సైట్లు, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ వీడియో స్ట్రీమింగ్‌లు తమ వీడియోల క్వాలిటీని చాలా తగ్గించాయి.

Next Story