క‌రోనా బాధితుల కోసం విరాట్ సాయం.. ఎంతిచ్చాడంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 March 2020 8:21 AM GMT
క‌రోనా బాధితుల కోసం విరాట్ సాయం.. ఎంతిచ్చాడంటే..?

క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) పై పోరులో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలకు అండ‌గా ఉండేందుకు సెల‌బ్రెటీలతో పాట సామాన్యులు ముంద‌కు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో భార‌త క్రీడాకారులు త‌మ ఉదార స్వ‌భావాన్ని చాటుకున్నారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రూ. 50 లక్షలు, ఎంపీ, మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ రూ. 50 లక్షలు, సురేశ్‌ రైనా రూ. 52 లక్షలు, భార‌త టెస్ట్ వైస్ కెప్టెన్ రూ.10ల‌క్ష‌లు, స్టార్‌ స్ప్రింటర్‌ హిమదాస్‌ తన నెల జీతం, భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) రూ. 51 కోట్ల , శిఖ‌ర్ ధావ‌న్‌, ఇర్ఫాన్ ప‌ఠాన్ లు త‌మ వంతు సాయాన్ని అందించారు.

తాజాగా విరుష్క జంట సాయాన్ని అందించేందుకు ముందుకు వ‌చ్చారు. క‌రోనా బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సహాయంగా ప్రధాన మంత్రి‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇస్తామని ప్రకటించారు. అయితే ఎంత మొత్తం విరాళంగా ఇస్తారనేది మాత్రం వెల్లడించలేదు. ‘‘వారి బాధను చూస్తుంటే మా గుండెలు పగిలిపోతున్నాయి. మేము చేసే సాయం తోటి పౌరులకు బాధ నుంచి విముక్తి కల్పిస్తుందని ఆశిస్తున్నాం. పీఎం కేర్స్‌ ఫండ్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించాలని నేను అనుష్క నిర్ణయించుకున్నాం’’ అని కోహ్లి ట్వీట్‌ చేశాడు.



Next Story