రెండు రోజుల పాటూ వర్షాలే వర్షాలు.. ఎక్కడ ఎక్కువంటే.?
తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి.
By Medi Samrat
తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. సాయంత్రం భారీ వర్షం కురిచే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సచివాలయం, ఆబిడ్స్, నాంపల్లి, పటాన్ చెరువు, శేరిలింగం పల్లి, సికింద్రాబాద్లలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణలో రాగల రెండురోజుల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేందం హెచ్చరించింది. గురువారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ వడగళ్లు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాది భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాలకు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, జనగాం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.