తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు వ‌ర్షాలు

Today and Tomorrow moderate rains expected in Telangana.తెలంగాణ రాష్ట్రంలో భిన్న‌మైన వాతావ‌ర‌ణం ఉంటోంది. కొన్ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 April 2022 9:01 AM IST
తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు వ‌ర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో భిన్న‌మైన వాతావ‌ర‌ణం ఉంటోంది. కొన్ని చోట్ల ఎండ‌లు మండిపోతుండ‌గా.. మ‌రికొన్ని కొద్దిపాటి వ‌ర్షాల‌తో ప్ర‌జ‌లు ఊర‌ట చెందుతున్నారు. విద‌ర్భ నుంచి తెలంగాణ మీదుగా క‌ర్ణాట‌క వ‌ర‌కు 900 మీట‌ర్లు ఎత్తున గాలుల‌తో ఉప‌రిత ద్రోణి కొన‌సాగుతోంద‌ని హైద‌రాబాద్‌లోని వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు తెలిపారు. ఫ‌లితంగా రాష్ట్రంలో రెండు రోజులు(సోమ‌, మంగ‌ళ‌) అక్క‌డ‌క్క‌డ‌క ఉరుములు, మెరుపుల‌తో ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. నిన్న కూడా హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్ జిల్లాలోని చాప్రాలలో నిన్న అత్యధికంగా 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Next Story