ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రకాశం, శ్రీ సత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నేడు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు చేసింది.
మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. కాగా గురువారం సాయంత్రం 5 గంటల వరకు తిరుపతి జిల్లా చిట్టమూరులో 88.5 మి.మీ, చింతవరంలో 81 మి.మీ, నెల్లూరు 61 మి.మీ, పాలూరులో 60 మి.మీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించింది.