జాగ్రత్త..రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

By -  Knakam Karthik
Published on : 21 Sept 2025 5:06 PM IST

Andrapradesh, Amaravati, State Disaster Management Authority, Thunderstorms, Heavy Rains

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక చేసింది. రాగల మూడు గంటల్లో కాకినాడ,అనకాపల్లి, పల్నాడు(వినుకొండ) జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కాగా ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది

శ్రీకాకుళం, అల్లూరి, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలుపగా, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎన్టీఆర్, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది

కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు దగ్గర నిలబడరాదు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

Next Story