బిగ్ అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో అక్కడకక్కడా ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
By అంజి Published on 2 Jun 2024 9:37 AM GMTబిగ్ అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో అక్కడకక్కడా ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి.
అటు నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఇప్పటికే కేరళ, కర్ణాటక, తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ముందుకు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో నైరుతి రుతు పవనాల ప్రభావం వల్ల వర్షాలు ప్రారంభమయ్యాయి. అనంతపురం జిల్లాలోని పలు మండలాల్లో రాత్రి నుండి వర్షం కురుస్తోంది.. ఉరవకొండ, విడపనకలు, వజ్రకరూరు మండలాల్లో భారీ వర్షతో పలుచోట్ల వాగులు పొంగిపొర్లుతున్నాయి.
బూదగవి వంక, పెంచుల పాడు-పొలికి గ్రామాల మధ్య పెద్ద వంక ఉదృతంగా ప్రవహిస్తుండడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలో గాలి, వాన బీభత్సం సృష్టించాయి. కోస్తాంధ్ర ప్రాంతంలో ఆవర్తన ప్రభావంతో రాగల 4 రోజులు అక్కడక్కడ భారీవర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.