వాతావరణ శాఖ చెబుతోంది వింటే భయమేస్తోంది..!

తెలంగాణలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ అంచనా వేసింది.

By Medi Samrat
Published on : 28 March 2025 4:17 PM IST

వాతావరణ శాఖ చెబుతోంది వింటే భయమేస్తోంది..!

తెలంగాణలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ అంచనా వేసింది. విపరీతమైన వేడి, ఉక్కబోతలకు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉండగా వాతావరణ శాఖ అధికారులు చెబుతోంది వింటే భయమేస్తోందని ప్రజలు అంటున్నారు. హైదరాబాద్‌ నగరంలో కూడా ఈ నెలాఖరు వరకు గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చు.

IMD హైదరాబాద్ ప్రకారం, రాష్ట్రంలోని 15 జిల్లాల్లో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, కొమరం భీమ్, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాల్లో వేడి మరీ ఎక్కువగా ఉండనుంది. హైదరాబాద్‌ నగరంలో కూడా 36-40 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Next Story