ఈ నెల 13న పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో 13, 14, 15 తేదీల్లో తెలంగాణలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే హైదరాబాద్ సహా జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. అటు ఏపీలో అల్పపీడనం ప్రభావంతో రేపటి నుంచి 14 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ కోస్తా, రాయలసీమల్లోని పలుచోట్ల పిడుగులతో కూడిన వానలు పడతాయని తెలిపింది.
దక్షిణకోస్తాంధ్ర మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో 2రోజులపాటు ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది.
అటు తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో నేడు అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.