నైరుతి రుతుపవనాల గురించి గుడ్ న్యూస్

SOUTHWEST MONSOON TO ARRIVE EARLY SAYS IMD. రానున్న 24 గంటల్లో ఇండియాలోకి నైరుతి రుతుపవనాలు వాతావరణ శాఖ ప్రవేశిస్తాయని వెల్లడించింది.

By Medi Samrat  Published on  16 May 2022 4:12 PM IST
నైరుతి రుతుపవనాల గురించి గుడ్ న్యూస్

రానున్న 24 గంటల్లో ఇండియాలోకి నైరుతి రుతుపవనాలు వాతావరణ శాఖ ప్రవేశిస్తాయని వెల్లడించింది. అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు వస్తాయని తెలిపింది. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని, ఈ నెలఖరులోగా కేరళను తాకుతాయని చెప్పింది. జూన్ 8వ తేదీ లోగా తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది. మరోవైపు నిన్న రాత్రి హైదరాబాదులో భారీ వర్షం కురిసింది.

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తొందరగానే పలకరిస్తాయని ముందుగానే వాతావరణ శాఖ వెల్లడించింది. మే 15కల్లా నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్‌ సముద్ర ప్రాంతం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. ఏటా జూన్‌ మొదటి వారంలో కేరళలో ప్రవేశించే రుతుపవనాలు ఈ సారి ముందుగానే వస్తాయి.ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాల సీజన్ ఉంటుందని ఐఎండీ ప్రకటించింది. నైరుతి రుతుపవనాల వర్షాలు ఈ ఏడాది సాధారణ స్థాయిలోనే ఉంటుందని అంచనా వేసింది.

జూన్ నెలలో నైరుతి రుతుపవనాల ప్రారంభం తర్వాత ఉత్తర, మధ్య భారత్‌లోని చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని, ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాలు, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ ద్వీపకల్పంలోని దక్షిణ ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.










Next Story