నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది కొంచెం ఆలస్యంగా రానున్నాయి. జూన్ 4వ తేదీన కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణ వర్షపాతాన్ని అందిస్తాయని ఐఎండీ తెలిపింది. భారత్ లోకి ప్రవేశించిన రుతుపవనాలు ఆలస్యంగా విస్తరిస్తే ఆ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని, రుతుపవనాలు త్వరగా విస్తరిస్తే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని నిపుణులు చెబుతుంటారు. భారత్ లో ఈ ఏడాది నైరుతి సీజన్ లో 96 శాతం వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది.
నైరుతి రుతుపవనాలతో దేశవ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం హీట్‌వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాకాలం కాస్త ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. గడిచిన 18 ఏళ్ల నుంచి భారతీయ వాతావరణ శాఖ నైరుతీ రుతుపవనాల గురించి అంచనాలు వేస్తోంది. సాధారణంగా జూన్ ఒకటో వారంలో కేరళలోకి రుతుపవనాలు ఎంటర్ అవుతాయి.