ఏపీకి వర్ష సూచన
ద్రోణి ప్రభావంతో రేపు, ఎల్లుండి అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
By Medi Samrat Published on 16 Jun 2024 2:28 PM GMTద్రోణి ప్రభావంతో రేపు, ఎల్లుండి అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
రేపు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు,నంద్యాల,శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య , చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఎల్లుండి అల్లూరి సీతారామరాజు, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.అలాగే పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
ఆదివారం సాయంత్రం 6 గంటల నాటికి కాకినాడ రూరల్లో 83మిమీ, ఏలూరు జిల్లా నిడమర్రు 80.7మిమీ, విజయనగరంలో 70మిమీ, అల్లూరి జిల్లా కూనవరంలో 48.5మిమీ, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో 47.5మిమీ, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 45మిమీ, కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 31.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.