ఏపీలో ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో వర్షాలు ఇలా ఉంటాయి

ఈ సీజన్‌లో నైరుతి రుతుపవనాల చివరి దశ అయిన ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ సంస్థ తెలిపింది.

By Medi Samrat  Published on  1 Aug 2024 4:00 PM GMT
ఏపీలో ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో వర్షాలు ఇలా ఉంటాయి

ఈ సీజన్‌లో నైరుతి రుతుపవనాల చివరి దశ అయిన ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ సంస్థ తెలిపింది. ఆగస్టులో దక్షిణ కోస్తా ఆంధ్ర లో సాధారణం కంటే వర్షం ఎక్కువగానూ, ఉత్తర కోస్తాలో సాధారణం నుండి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD తన నివేదికలో పేర్కొంది. సెప్టెంబర్‌లో మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో జూలైలో 34 శాతం, జూన్‌లో 14 శాతం అధిక వర్షపాతం నమోదైందని వెల్లడించింది.

రాష్ట్రంలోనే అత్యధికంగా అనకాపల్లి జిల్లాలో సాధారణం కంటే 95 శాతం అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో సాధారణ వర్షపాతం 151.8 మి.మీ కాగా.. 294.4మి.మీ. నమోదైంది. ఏలూరులో సాధారణం కంటే 91 శాతం అధికంగా నమోదైంది. రాయలసీమలో పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో ఉంది. జిల్లాలో సాధారణ వర్షపాతం 63.8 మి.మీ. కాగా.. 22.3 మి.మీ మాత్రమే నమోదైంది. కర్నూలులో 43 శాతం, వైఎస్ఆర్ జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 43 శాతం తక్కువగా నమోదైంది.

Next Story