తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎం) తెలిపింది.
By అంజి
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎం) తెలిపింది. దీని ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
వాయువ్య బంగాళాఖాతం,ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని #APSDMA పేర్కొంది.దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం,విజయనగరం,మన్యం, అల్లూరి,విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి-మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) September 6, 2025
అటు తెలంగాణలో కూడా నేడు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.
0900 यूटीसी पर आधारित तेलंगाना का 7-दिवसीय पूर्वानुमान (शाम) 1730 बजे IST पर जारी किया गया/7-day forecast(EVENING) of TELANGANA based on 0900 UTC issued at 1730 hours IST Dated :06/09/2025 pic.twitter.com/9XOpIZ66P0
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) September 6, 2025
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, సిద్ధిపేట, వరంగల్ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది.