రేపట్నుండి తెలంగాణలో వర్షాలు మొదలు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఎండలు మండిపోతూ ఉన్నాయి. టిఎస్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) ప్రకారం,
By Medi Samrat Published on 6 April 2024 4:43 PM ISTతెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఎండలు మండిపోతూ ఉన్నాయి. టిఎస్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) ప్రకారం, శుక్రవారం నాడు బంజారాహిల్స్‌లో 42.4 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. హైదరాబాద్ లో పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ నుండి 43 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్నాయి. అయితే రేపటి నుండి నగరంపై ఆకాశం మేఘావృతమై ఉంటుందని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది.
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వరుసగా మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ ఐఎండీ అంచనా వేసింది. అన్ని జిల్లాలలోనూ వర్షం కురవకపోవచ్చు.. అయితే వేడిగాలుల నుండి ఉపశమనం మాత్రం పొందవచ్చని అంచనా వేస్తున్నారు. ఆదివారం నుండి వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఇది మంగళవారం ఏప్రిల్ 9, 2024 వరకు కొనసాగుతుంది. ఏప్రిల్ 8వ తేదీన ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీమ్, నిజామాబాద్, జగిత్యాల్, కరీంనగర్, పెద్దపల్లె, మంచిర్యాల జిల్లాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 9 వరకు మేఘాలు క్రమంగా పెరుగుతాయని.. పొగమంచు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఏప్రిల్ 6న, రోజు పాక్షికంగా మేఘావృతమవుతుంది. అయితే హైదరాబాద్‌లో వర్షాలు కురిసే అవకాశం లేదు. ఏప్రిల్ 7 నుండి తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయని వాతావరణ అధికారులు తెలిపారు.