తెలంగాణకు వర్ష సూచన
Rain Alert For Telangana. బుధవారం ఉత్తర ఛత్తీస్‌ఘడ్ దాని పరిసర ప్రాంతాలలో కొనసాగిన ఉపరితల అవర్తనం
By Medi Samrat Published on 23 Sep 2021 9:05 AM GMTబుధవారం ఉత్తర ఛత్తీస్‌ఘడ్ దాని పరిసర ప్రాంతాలలో కొనసాగిన ఉపరితల అవర్తనం.. ఈ రోజు దక్షిణ ఛత్తీస్‌ఘడ్ దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతూ.. సగటు సముద్ర మట్టం నుండి 5.8 కీ.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. అలాగే.. ఈ రోజు ఉపరితల ఆవర్తనం మయన్మార్ తీరం పరిసర మర్తబన్ గల్ఫ్ ప్రాంతాలలో ఏర్పడి.. మధ్యస్థ ట్రోపోస్పీరిక్ ఎత్తు వరకు కొనసాగుతుంది. ఈ అవర్తనం వాయువ్య దిశలో కదిలి.. ఈశాన్య పరిసర తూర్పు మధ్య బంగళాఖాతంలో ప్రాంతాలకు చేరుకొని.. రేపు 24న సాయంత్రంకి అల్పపీడనంగా అదే ప్రదేశంలో ఏర్పడే అవకాశం ఉన్నది.
ఈ అల్పపీడనం తదుపరి 24 గంటలలో ఒడిస్సా తీరంకి చేరుకునే అవకాశం ఉన్నది. ఉపరితల ఆవర్తనం తెలంగాణ మరియు దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టం నుండి 3.1 కి.మీ నుండి 4.5 కి.మీ మధ్యలో కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాలలో వచ్చే అవకాశం ఉంది. ఒకటి, రెండు ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాలలో ఈ మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.