Rain Alert : రేపు, ఎల్లుండి ఈ జిల్లాల‌లో వ‌ర్షాలు

నైరుతి బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం కేంద్రీకృతమై ఉందని దీని ప్రభావంతో శని,ఆదివారాల్లో నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

By -  Medi Samrat
Published on : 9 Jan 2026 8:05 PM IST

Rain Alert : రేపు, ఎల్లుండి ఈ జిల్లాల‌లో వ‌ర్షాలు

నైరుతి బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం కేంద్రీకృతమై ఉందని.. దీని ప్రభావంతో శని,ఆదివారాల్లో నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీవ్ర వాయుగుండం రేపు మధ్యాహ్నం సమయంలో ఉత్తర శ్రీలంక ట్రింకోమలీ - జాఫ్నా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించింది.

Next Story