రానున్న మూడు గంటలు జాగ్ర‌త్త‌.. ఈ జిల్లాల‌కు పిడుగుపాటు హెచ్చరిక..

రానున్న మూడు గంటల్లో శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చ‌రించింది.

By -  Medi Samrat
Published on : 12 Oct 2025 6:56 PM IST

రానున్న మూడు గంటలు జాగ్ర‌త్త‌.. ఈ జిల్లాల‌కు పిడుగుపాటు హెచ్చరిక..

రానున్న మూడు గంటల్లో శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చ‌రించింది. దీంతో ప్ర‌జ‌లు చెట్ల క్రింద ఉండవ‌ద్ద‌ని.. అప్రమత్తంగా ఉండాల‌ని.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండని సూచించింది.

ఇదిలావుంటే.. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆదివారం అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ నిన్న ప్ర‌క‌ట‌న ద్వారా తెలిపింది.

Next Story