దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆదివారం(12-10-25) అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆకస్మాత్తుగా ఉరుములు,మెరుపులతో వర్షాలు పడేప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
చిత్తూరులో 34.2మిమీ, తూర్పుగోదావరి(జి) లక్ష్మీపురంలో 31మిమీ, శ్రీకాకుళం(జి) కోర్లాంలో 26.7మిమీ వర్షపాతం నమోదైందని వెల్లడించింది.