దక్షిణ ఒడిశా నుండి మన్నార్ గల్ఫ్ వరకు ఉన్న ద్రోణి ఇవాళ దక్షిణ ఒడిశా నుండి కొమోరిన్ ప్రాంతం వరకు కోస్తాంధ్ర, రాయలసీమ,తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
దీని ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, రాయలసీమ జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
శుక్రవారం(10-10-25)
▪️అల్లూరి సీతారామరాజు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
గురువారం సాయంత్రం 4 గంటలకు అనకాపల్లిలో 52.2మిమీ, దేశపాత్రునిపాలెంలో 48.5మిమీ, అల్లూరి(జి) పాడేరులో 41.7మిమీ వర్షపాతం నమోదైందన్నారు.