రానున్న మూడు గంటలు జాగ్రత్త.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
By - Medi Samrat |Published on : 7 Oct 2025 3:40 PM IST

ఏపీలోని పలు జిల్లాలలో ప్రజలు రానున్న మూడు గంటలు జాగ్రత్తగా ఉండాలని పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. వాటి వివరాలు..
🔴రెడ్ అలెర్ట్
విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు
🟠ఆరెంజ్ అలెర్ట్
శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, నెల్లూరు జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు
🟡 ఎల్లో అలెర్ట్
పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు
ఈ జిల్లాలలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు చెట్ల క్రింద ఉండవద్దని.. అప్రమత్తంగా ఉండండని.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
Next Story