ఆగ్నేయ-నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అంచనా వేస్తోంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనించి శ్రీలంక-తమిళనాడు తీరాల దిశగా వస్తుందని, ఈ ప్రభావంతో ఏపీ కోస్తా జిల్లాలు, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో డిసెంబర్ 11, 12 తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వర్షాకాలం వచ్చినా కూడా వర్షాలు ఆంధ్రప్రదేశ్ ను వదలడం లేదు. నవంబర్ నెలలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి. డిసెంబర్ నెలలో కూడా ఇదే తరహాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.