విజయవాడ, గుంటూరులో వరదల నుంచి ప్రజలు తేరుకోడానికి ఇంకా ఇబ్బందులు పడుతుండగా మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 5 నాటికి పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని IMD అమరావతి ప్రకటించింది. దీని తీవ్రత, గమనాన్ని అంచనా వేయడానికి మరో రెండు రోజులు పడుతుందని అమరావతి ఐఎండీ వెంకట్‌రావు తెలిపారు.
సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, రైసెన్, ఛింద్వారా, తూర్పు విదర్భ మీదుగా అల్పపీడన కేంద్రం.. తెలంగాణ, మచిలీపట్నం, ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వెళుతుంది.
ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమల్లోని పలు ప్రదేశాల్లో మంగళవారం గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని, ఆ తర్వాత బుధవారం నుంచి సెప్టెంబరు 5 వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD నివేదికలో తెలిపింది.