ఆగస్టు 29 వరకు ఉత్తర కోస్తాంధ్ర, యానాం మీదుగా వివిధ ప్రదేశాలలో మెరుపులతో కూడిన ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అదే సమయంలో ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమలోని పలు ప్రదేశాలలో గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో ఉత్తర కోస్తా లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి.
అల్పపీడనం ప్రభావంతో రానున్న ఐదురోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో అకడకడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.