11 నుంచి 13వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు

Rain Alert For Andhra Pradesh. నైరుతి బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో మూడు రోజుల పాటు

By Medi Samrat  Published on  10 Nov 2022 11:45 AM GMT
11 నుంచి 13వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు
నైరుతి బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంక తీరాన్ని ఆనుకుని అల్పపీడన ప్రాంతం కొనసాగుతోందని, రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఈ నెల 12వ తేదీ ఉదయం వరకు ఇది వాయవ్య దిశగా తమిళనాడు-పుదుచ్చేరి వైపు పయనిస్తుందని, ఆ తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని, గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు.


Next Story