నైరుతి రుతుపవనాలు ముందే వస్తున్నాయా? మే 31 నాటికి భారత ప్రధాన భూభాగాన్ని కేరళ వద్ద నైరుతి తాకుకుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే అంతకంటే ముందే అవి విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేరళను తాకిన కొన్ని రోజుల్లోనే నైరుతి రుతుపవనాలు ఏపీని తాకే అవకాశాలున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం అండమాన్ సహా హిందూ మహాసముద్రంలోని వివిధ ప్రాంతాలు, శ్రీలంకలోని కామోరిన్ ప్రాంతాలను చుట్టేశాయని IMD స్పష్టం చేసింది. గత ఏడాది జూన్ 4 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ భూభాగాన్ని తాకే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. అప్పుడు జూన్ 8న కేరళ తీరం చేరాయి.
తెలంగాణలోకి ఈ ఏడాది జూన్ 5 - 11 మధ్యలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. కేరళకు రుతుపవనాలు వచ్చాక.. అక్కడి నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణ చేరుకోవడానికి అయిదారు రోజుల సమయం పడుతుంది. రుతుపవనాల రాకలో జాప్యం జరిగితే జూన్ రెండో వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.