నేడు ఏపీలో భారీ వర్షాలు.. తెలంగాణలో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
రాష్ట్రంలో 4 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది.
By అంజి
నేడు ఏపీలో భారీ వర్షాలు.. తెలంగాణలో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్: రాష్ట్రంలో 4 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. ఇవాళ, రేపు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, పెద్దపల్లి, సిద్ధిపేట, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో అక్కడక్కడ వర్షాలు పడతాయని తెలిపింది.
అటు ఏపీలో మరో రెండు రోజుల వరకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు ఏపీఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. నిన్న 7గంటల నాటికి కాకినాడ(D)కాజులూరులో 100. 5మిమీ, చొల్లంగిపేటలో 94.5, కరపలో 75.5మిమీ, కాకినాడలో 66.7మిమీ చొప్పున,130చోట్ల 20మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యింది.
సోమ,మంగవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం,మన్యం,అల్లూరి, విశాఖ,ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల, పల్నాడు,ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూగో, పగో, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు రానున్న రెండు రోజులు కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 41°C - 42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు.