తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతున్నాయి. నేటి నుంచి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

By అంజి  Published on  12 Jun 2024 1:33 AM GMT
Hyderabad Meteorological center, heavy rains, Telangana, Hyderabad

తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతున్నాయి. నేటి నుంచి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఈనెల 5న మహబూబ్‌నగర్‌ నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఇవాళ ఆదిలాబాద్‌, నిర్మల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల్‌, సిద్ధిపేట, యాదాద్రి, మేడ్చల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో వానలు పడతాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

రేపు కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మలాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఓ మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది. మూడు రోజులపాటు ఆయా ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్‌ హెచ్చరికలను జారీ చేసింది.

Next Story