వాయుగుండంగా మారిన అల్పపీడనం

Low Pressure turns into cyclone in Bay of Bengal.బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం తీవ్ర వాయుగుండంగా మారింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 March 2022 4:06 PM IST
వాయుగుండంగా మారిన అల్పపీడనం

బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం తీవ్ర వాయుగుండంగా మారింది. ప్ర‌స్తుతం ఇది త‌మిళ‌నాడులోని నాగ‌ప‌ట్ట‌ణానికి తూర్పు ఈశాన్యంగా 300 కి.మీ దూరంలో కేంద్రీకృత‌మై ఉంది. ప్ర‌స్తుతం ఇది 13 కి.మీ వేగంతో ఉత్త‌ర దిశ‌గా క‌దులుతోంది. సాయంత్రానికి త‌మిళ‌నాడు తీరానికి మ‌రింత ద‌గ్గ‌ర‌గా వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. తీరం దాటే స‌మ‌యంలో 70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయ‌ని చెప్పింది.

దీని ప్ర‌భావంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ద‌క్షిణ కోస్తాంద్ర‌, రాయ‌ల‌సీమ జిల్లాల్లో వ‌ర్షాలు ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది. ఇక త‌మిళ‌నాడులో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తాయ‌ని వెల్ల‌డించింది. తమిళనాడు, కోస్తాంధ్రలో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయ‌ని మత్స్యకారులు వేటకు వెళ్లొదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఏవైనా అవాంత‌రాలు ఎదురైతే సంబంధిత శాఖ అధికారుల‌ను సంప్ర‌దించాల‌ని కోరింది.

Next Story