అక్టోబరు 4 నుంచి 6 వరకు.. వచ్చే రెండు మూడు రోజుల పాటు ఉత్తర కోస్తా ఏపీ (NCAP), దక్షిణ కోస్తా AP (SCAP), యానాంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సోమవారం వైజాగ్ నగరంతో పాటు ఎన్‌సీఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసరాల్లో అల్పపీడన ప్రాంతం (ఎల్‌పీఏ) ఏర్పడిందని IMD-అమరావతి శాస్త్రవేత్త డాక్టర్ సగిలి కరుణసాగర్ తెలిపారు.
దేశంలోని 9 రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులపాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. మంగళవారం నుంచి మూడు రోజులపాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాలైన సౌత్ 24 పరగణాస్, పుర్బా, పశ్చిమ మేదీనీపూర్, కోల్ కతా ప్రాంతాల్లో మంగళవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఉత్తర బెంగాల్, డార్జిలింగ్, కలింపొంగ్ ప్రాంతాల్లో బుధవారం నుంచి భారీవర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.