తెలంగాణ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్ గడ్ నుండి తెలంగాణ మీదుగా దక్షిణ కర్ణాటక వరకూ ఉపరితల ద్రోణి గాలులతో పాటు.. కర్నాటకపై 3.1 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ పేర్కొన్నది. వీటి ప్రభావంతో శనివారం నుంచి రాష్ట్రంలో 4 రోజుల పాటు.. ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు కూడిన వర్షాలకు అవకాశం ఉందని ప్రకటించింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.