మరో నాలుగు రోజులు వర్షాలు.. ఐఎండీ రెయిన్ అల‌ర్ట్‌

హైదరాబాద్ నగరంలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది

By Medi Samrat  Published on  3 Sep 2024 8:56 AM GMT
మరో నాలుగు రోజులు వర్షాలు.. ఐఎండీ రెయిన్ అల‌ర్ట్‌

హైదరాబాద్ నగరంలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. సెప్టెంబరు 6 వరకూ వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని అంచనా వేసింది. తెలంగాణలోని ప‌లు జిల్లాలకు ఈరోజు, రేపు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఉరుములు, మెరుపులు, కుంభవృష్టి త‌ల‌పించే విధంగా ఉంటుంద‌ని వాతావరణ పరిస్థితులను అంచనా వేసింది.

గత కొద్ది రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొన్ని జిల్లాలు ముంపునకు గురవుతున్నాయి. రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని IMD హైదరాబాద్ అంచనా వేయడం వల్ల ప్రస్తుత నైరుతి రుతుపవనాల సమయంలో నగరంలో కురిసే వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉంది.

Next Story