Rain Alert : అప్పటి వరకూ వర్షాలే.. వర్షాలు

తెలంగాణలో జూన్ 11 బుధవారం వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ అంచనా వేసింది.

By Medi Samrat
Published on : 7 Jun 2025 9:15 PM IST

Rain Alert : అప్పటి వరకూ వర్షాలే.. వర్షాలు

తెలంగాణలో జూన్ 11 బుధవారం వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ అంచనా వేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ శాఖ ప్రకారం, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. IMD హైదరాబాద్ అంచనాల దృష్ట్యా, ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. జూన్ 10, మంగళవారం వరకు హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

రెండు రోజుల పాటూ తీవ్రమైన వేడి తర్వాత జూన్ 7, శనివారం హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిశాయి. నాంపల్లి, చార్మినార్‌, మలక్‌పేట్‌, కోటి, అబిడ్స్‌, అంబర్‌పేట, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మెహదీపట్నం, అంబర్‌పేట, జూబ్లీహిల్స్‌, ఆసిఫ్‌నగర్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌గడ్డ, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్‌మ్యాన్‌ అంచనా వేశారు.

Next Story