అల‌ర్ట్‌.. హైదరాబాద్‌కు వ‌ర్ష సూచ‌న‌

హైదరాబాద్ నగరంలో ఈరోజు వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.

By Medi Samrat  Published on  24 Jun 2024 10:19 AM IST
అల‌ర్ట్‌.. హైదరాబాద్‌కు వ‌ర్ష సూచ‌న‌

హైదరాబాద్ నగరంలో ఈరోజు వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఉదయం నుంచి నగరంలో ప‌లుచోట్ల న‌ల్ల‌టి మేఘాలు కమ్ముకున్నాయి. నిన్న నగరంలో భారీ వర్షం కురిసింది. అక‌స్మాత్తుగా కురిసిన వ‌ర్షంలో న‌గ‌ర ప్ర‌జ‌ల‌ రోజువారీ జీవితానికి కొంత‌మేర‌ అంతరాయం కలిగింది. అనేక ప్రాంతాలలో నీటి ఎద్దడి కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

నగరంలో వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రోజు నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని అంచనా వేసింది. జూన్ 27 వరకు నగరంలో ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ విభాగం తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం వరకు వర్షాలు కురుస్తాయని కూడా వాతావ‌ర‌ణ శాఖ‌ అంచనా వేసింది.

Next Story