తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ వెల్లడించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తెలంగాణలోని వివిధ జిల్లాలకు IMD హైదరాబాద్ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
కచ్చితమైన వాతావరణ అంచనాలకు పేరుగాంచిన తెలంగాణ వెదర్‌మ్చాన్, దక్షిణ మరియు మధ్య తెలంగాణాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. హైదరాబాద్‌లో మధ్యాహ్నం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
నగరం విషయానికొస్తే.. మంగళవారం ఈదురు గాలులతో కూడిన వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
అక్టోబరు 31 శుక్రవారం వరకు ఉదయం సమయంలో వాతావరణం పొగమంచుతో ఉంటుందని అంచనా వేసింది. ఉరుములతో కూడిన వర్షం దృష్ట్యా.. ప్రజలు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించింది.