రానున్న నాలుగు రోజుల పాటు నగరంలోని అన్ని జోన్లలో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది. వాతావరణ శాఖ ప్రకారం.. జూన్ 8 వరకు చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
నిన్న తెలంగాణలోని ములుగు, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షపాతం నమోదైంది.
రుతుపవనాలకు ముందు కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. నిన్న మహబూబ్‌నగర్‌లో 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక హైదరాబాద్, ఖైరతాబాద్‌లో 36.2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది.
గత కొద్ది రోజులుగా వేసవి తాపంతో సతమతమవుతున్న తెలంగాణ వాసులకు IMD హైదరాబాద్ చేసిన అలర్ట్ ఎంతవరకు ఉపశమనం కలిగిస్తుందో చూడాలి.