హైదరాబాద్‌కు రెయిన్ అల‌ర్ట్‌..!

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సూచనల మేరకు ఈరోజు హైదరాబాద్‌లో వర్షం కురిసే అవకాశం ఉంది.

By Kalasani Durgapraveen  Published on  1 Nov 2024 12:05 PM IST
హైదరాబాద్‌కు రెయిన్ అల‌ర్ట్‌..!

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సూచనల మేరకు ఈరోజు హైదరాబాద్‌లో వర్షం కురిసే అవకాశం ఉంది. నవంబర్ 1న చినుకులు లేదా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

గరిష్ట ఉష్ణోగ్రత 26.47 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ లో రేపటి కనిష్ట ఉష్ణోగ్రత 22.17 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయ్యే అవకాశం ఉంది. అలాగే గరిష్ట ఉష్ణోగ్రత 30.29 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుందని అంచనా. ఈరోజు ఉదయం సాపేక్ష తేమ 69% గా నమోదు అయింది. సూర్యోదయం 06:14:34 గంటలకు కాగా.. సూర్యాస్తమయం 17:44:40 గంటలకు ఉంటుంది.

Next Story