గత కొన్ని రోజులుగా వేసవి వేడితో సతమతమవుతున్న హైదరాబాద్ వాసులకు మార్చి 22, 23 తేదీల్లో కాస్త ఉపశమనం లభించనుంది. ఆ రెండు రోజులు హైదరాబాద్ లో వర్షాలు కురవనున్నాయి. ఆది, సోమవారాల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది.
మంచిర్యాలు, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల్‌లలో కూడా బలమైన గాలులు, వర్షం పడే అవకాశం ఉంది. మార్చి 22, 23 తేదీల్లో హైదరాబాద్ నగరంతో పాటు మరో 17 జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.