బంగాళాఖాతంలో అల్పపీడనం.. దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే ఛాన్స్.!

Heavy to heavy rainfall alert for andhra pradesh. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో పాటు దేశంలో ఈశాన్య రుతపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.

By అంజి  Published on  6 Nov 2021 3:20 PM IST
బంగాళాఖాతంలో అల్పపీడనం.. దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే ఛాన్స్.!

ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో పాటు దేశంలో ఈశాన్య రుతపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. నవంబర్‌ 9వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అది మరో మూడు రోజుల్లో అల్పపీడనంగా మారనుందని ఐఎండీ వెల్లడించింది. అది క్రమంగా బలపడి వాయువ్య దిశగా పయనిస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోసాధ్రంలో దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురువనున్నాయి. నవంబర్‌ 11, 12 తేదీల్లో దక్షిణ కోస్తాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 9, 10, 11, 12 తేదీల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రలో సముద్రం అల్లకల్లోలంగా ఉండనుంది.

మత్స్యకారులు చేపల వేటకు వెల్లొద్దని, వేటకు వెళ్లిన మత్స్యకారులు మరో రెండు రోజుల్లో తీర ప్రాంతాలకు చేరుకోవాలని ఐఎండీ స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏపీలో అత్యధిక వర్షపాతం నమోదైన నగరంగా విజయవాడ రికార్డు సృష్టించింది. విజయవాడలో అత్యధికంగా 1548 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. రెండో స్థానంలో ఉన్న కడపలో 1342 మి.మీ వర్షం పడింది. ఆ తర్వాత విజయనగరంలో 1331 మి.మీ వర్షం కురిసింది. తక్కువ వర్షపాతం నమోదైన నగరాల జాబితాలో నెల్లూరు (440 మి.మీ వర్షపాతం) నిలిచింది. ఇదిలా ఉంటే విశాఖ ఏజెన్సీలో చలిగాలులు ప్రారంభం కావడంతో.. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. పొగమంచు కురుస్తోంది.

Next Story