Rain Alert : ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
By - Knakam Karthik |
అల్పపీడనం ప్రభావంతో ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు
అమరావతి: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర అంతర్గత తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం నేడు అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో కర్నూలు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని స్పష్టం చేశారు. కాగా ప్రజలు ఈ సమయంలో చెట్ల కింద నిలబడరాదని, అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
తీరం వెంబడి గంటకు 35-55కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. అత్యవసర సహయక చర్యల కోసం 1 NDRF, 4 SDRF బృందాలని ప్రభావిత జిల్లాలకు పంపించామన్నారు. దీని ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రానున్న 5 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే 5 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది.
🔲నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు తీరంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.🔲 ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి & దక్షిణకోస్తా తీరాల వైపుగా కదిలే అవకాశం ఉందని వెల్లడించింది. pic.twitter.com/KOofNBedpp
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 22, 2025