బిగ్ అలర్ట్.. ఏపీలో నేడు భారీ వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది.
By అంజి
బిగ్ అలర్ట్.. ఏపీలో నేడు భారీ వర్షాలు
అమరావతి: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. శుక్రవారం అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు పడేందుకు అవకాశం ఉందని ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
పిడుగులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వద్ద నిలబడరాదన్నారు. నిన్న సాయంత్రం 6 గంటల నాటికి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో54మిమీ, ఏలూరు జిల్లా నిడమర్రులో54మిమీ, కాకినాడ జిల్లా కాజులూరులో 42మిమీ వర్షపాతం నమోదైందన్నారు. అలాగే రేపు ఉష్ణోగ్రతలు 41-42°Cమధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు. నిన్న బాపట్ల జిల్లా ఇంకొల్లు 42.6°C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యిందని తెలిపారు.