తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..ఇవాళ భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది
By Knakam Karthik
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..ఇవాళ భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.
ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీఎస్‌డీఎమ్‌ఏ తెలిపింది.
Due To Fresh Low Pressure We can expect Some Widespread Light To Moderate Rains Over Parts of Ubhaya Godavari,Konaseema,Eluru,NTR(Vijayawada),Bapatla,Guntur Districts During July(7-9).Meanwhile few Parts of Rayalaseema and South Ap will get Isolated Rains.#AndhraPradesh #rain pic.twitter.com/qer4pg4DQN
— ANDHRA WEATHER (@Andhra_weather) July 6, 2025