కరీంనగర్ జిల్లాలో కుండ‌పోత వ‌ర్షాలు

Heavy rain recorded in old Karimnagar. గత 24 గంటల్లో కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యాయి.

By Medi Samrat  Published on  10 Sept 2022 2:37 PM IST
కరీంనగర్ జిల్లాలో కుండ‌పోత వ‌ర్షాలు

గత 24 గంటల్లో కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యాయి. పిడుగులు ఓ మహిళా రైతుతో పాటు తొమ్మిది ఆవులను బలిగొన్నాయి. అత్యధికంగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లిలో 160.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, కొతలాపూర్‌లో 143.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మద్దుట్ల, మల్లియల్ లో 133.0, జగిత్యాల జిల్లా కొడిమిలాల్ మండలం తిరుమలాపూర్ 132, పెద్దపల్లి రామగుండం 122.3, పూడూర్ 119.3, గోవిందారం 107.8, ఏదుళ్లగట్టేపల్లి, గంగాధర 103.5, ఆకెనపల్లిలో 102 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మర్రిపెల్లి భాగ్యవ్వ(50) అనే మహిళా రైతు పిడుగుపాటుకు మృతి చెందింది. రాజన్న-సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ముడపల్లిలో వ్యవసాయ పొలాల్లో పని చేస్తుండగా పిడుగు పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఘటనలో శుక్రవారం రాత్రి పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూరులో పిడుగుపాటుకు తొమ్మిది ఆవులు, ఒక దూడ మృతి చెందాయి.


Next Story