అలర్ట్: తెలంగాణకు భారీ వర్ష సూచన

రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

By Medi Samrat  Published on  4 Dec 2023 7:00 PM IST
అలర్ట్: తెలంగాణకు భారీ వర్ష సూచన

రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌ కర్నూల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. భూపాలపల్లి, జయశంకర్‌, ములుగు, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆ జిల్లాలకు కూడా రెడ్‌ అలెర్ట్‌ను జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. కరీంనగర్‌, పెద్దపల్లి, నల్గొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కూరుస్తాయని.. వరంగల్‌, హన్మకొండ, కరీంనగర్‌, పెద్దపల్లి, నల్గొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణపైనా తుపాను ప్రభావం ఉంటుందని.. జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ వెల్లడించింది.

Next Story