Be Alert : రానున్న 72 గంటలు ఇలా ఉండబోతోంది..!

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 72 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది

By -  Medi Samrat
Published on : 24 Oct 2025 7:01 PM IST

Be Alert : రానున్న 72 గంటలు ఇలా ఉండబోతోంది..!

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 72 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. శుక్రవారం ఉదయం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ అల్పపీడనం, పశ్చిమ-వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. ఇది మరింత బలపడి అక్టోబర్ 25 నాటికి వాయుగుండంగా, అక్టోబర్ 26 నాటికి తీవ్ర వాయుగుండంగా మారనుందని ఐఎండీ తెలిపింది. అక్టోబర్ 27 ఉదయానికి నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఇది తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు, సోమవారం అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు ఎట్టిపరిస్థితుల్లోనూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Next Story