రానున్న రెండు రోజులు ఎండతీవ్రత ఎక్కువగా ఉండి 42-43°C వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం 54 మండలాల్లో తీవ్రవడగాలులు, 16 మండలాల్లో వడగాలులు, శనివారం 41 మండలాల్లో తీవ్రవడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
శుక్రవారం (03-04-26) శ్రీకాకుళం జిల్లాలో 13, విజయనగరం 19, పార్వతీపురంమన్యం 11, అల్లూరి 2, పోలవరం 3, విశాఖ 2, అనకాపల్లి 2, కాకినాడ 2 మండలాల్లో తీవ్రవడగాలులు(54) వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే శ్రీకాకుళం 2, విజయనగరం 4, మన్యం 2, పోలవరం 1, అనకాపల్లి 2, కాకినాడ 1, తూర్పుగోదావరి 2, ఏలూరు 1, ఎన్టీఆర్ 1 మండలాల్లో వడగాలులు(16) ప్రభావం చూపనున్నట్లు తెలిపారు.
వడగాల్పులు వీచే మండలాలు, ఉష్ణోగ్రతల పూర్తి వివరాలు క్రింది లింక్లో :
https://apsdma.ap.gov.in/files/73eb1c6d1557835b8f44c097febf34bd.pdf
గురువారం విజయనగరం(జి) రాజాంలో 40.6°C, మన్యం(జి) మక్కువ, చిత్తూరు(జి) నిండ్రలో 40°C, ఏలూరు(జి) ధర్మాజీగూడెంలో 39.8°C, తిరుపతి(జి) రేణిగుంటలో 39.6°C, పశ్చిమగోదావరి(జి) పోడూరులో 39.6°C, తూర్పుగోదావరి(జి) బ్రాహ్మణగూడెం, కృష్ణా(జి) కంకిపాడు, కర్నూలు(జి) తోవి 39.4°C, అనకాపల్లి(జి) నాతవరం, నంద్యాల (జి) ఆలమూరులో 39.3°C, కోనసీమ(జి) శివలలో 39.1°C, విశాఖ(జి) పద్మనాభం, అనంతపురం(జి) పాతకొత్తచెరువులో 39°C చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
వడగాలుల వీస్తున్నందున మహిళలు, పిల్లలు, వృద్దులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజలు డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS, ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.