ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లో భానుడి భగభగలు తప్పవని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. మార్చి నెల మొదలవ్వకముందే పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత అంతకంతకూ పెరిగిపోతూ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మరో మూడు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా, ఆ తర్వాత 3 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ , రాయలసీమలలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ రెండు రోజుల్లో, రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని, ఫిబ్రవరి 27 నుండి మార్చి 1 వరకు రాష్ట్రంలో ఇదే విధమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.