ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. 15 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.!

Andhra Pradesh, Tamil Nadu heavy rain forecast. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరో 24 గంటల్లో మారే ఛాన్స్‌ ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.

By అంజి  Published on  10 Nov 2021 7:17 AM GMT
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. 15 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.!

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరో 24 గంటల్లో మారే ఛాన్స్‌ ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీగా వర్షాలు కురువనున్నాయి. మూడు రోజుల పాటు ఉత్తర కోస్తా జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. వాయుగుండం నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లొదని హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతంలో గంటకు 40 - 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంత అధికారులు కలెక్టర్‌ అప్రమత్తం చేశారు.

మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అల్పపీడన ప్రభావం కారణంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 15 జిల్లాల్లో రెడ్‌ అలెర్ట్‌ను ప్రకటించింది. విల్లుపురం, చెంగల్‌ పట్టు, కాంచీపురం, చెన్నై, తిరువల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. శివగంగై, రామనాథపురం, కన్యాకుమారి, మధురై, పుదుకొట్టై, తేన్‌ కాశీ, తిరువారురు, తిరు నల్వేలి జిల్లాలో వర్షం ముప్పు పొంచి ఉంది. చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలను రంగంలోకి దించినట్లు అధికారులు తెలిపారు. 12 జిల్లాల్లో ఇవాళ, రేపు స్కూళ్లకు సెలవులను ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా వరద ఉప్పొంగుతోంది. దీంతో కావేరి, వైగై, థెన్‌-పెన్నై, భవానీ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

Next Story
Share it