బాలీవుడ్ కు మరో షాక్.. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Jun 2020 12:03 PM IST
బాలీవుడ్ కు మరో షాక్.. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ మృతి

బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు ఈ మధ్య కాలంలో మరణించారు. ఇప్పుడు మరో షాకింగ్ వార్త బాలీవుడ్ ను కమ్మేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ వాజిద్ ఖాన్ మరణించాడు. 42 సంవత్సరాల వయసులోనే వాజిద్ కన్ను మూయడం విషాదం. నెల రోజుల క్రితమే ఆయన కిడ్నీ మార్పిడి చేసుకోగా, కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. ముంబైలోని చెంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

సాజిద్-వాజిద్ కాంబోలో ఎన్నో హిట్ ఆల్బమ్స్ బాలీవుడ్ లో వచ్చాయి. సల్మాన్ ఖాన్ కు వాంటెడ్, దబాంగ్, ఏక్ థా టైగర్ లాంటి మ్యూజికల్ హిట్స్ ను ఇచ్చారు. సల్మాన్ ఖాన్ తో ఎంతో అనుబంధం ఉంది. 1998 లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'ప్యార్ కియాతో డర్నా క్యా' ద్వారా డెబ్యూ ఇచ్చారు. ఆ తర్వాత సల్మాన్ నటించిన గర్వ్, తేరే నామ్, తుమ్కో న భూల్ పాయేంగే, పార్టనర్ సినిమాలకే కాకుండా దబాంగ్ ఫ్రాంచైజ్ కు కూడా సంగీతాన్ని ఇచ్చారు. లాక్ డౌన్ సమయంలో సల్మాన్ ఖాన్ ఇటీవల రిలీజ్ చేసిన చేసిన 'ప్యార్ కరోనా', 'భాయ్ భాయ్' సాంగ్స్ ను వాజిద్ ఖాన్ కంపోజ్ చేసాడు.

వాజిద్ చనిపోయాడని తెలియగానే.. సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు సోషల్ మీడియాలో తమ దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రా, వరుణ్ ధావన్, బిపాసా బసు, ప్రీతీ జింతా తదితరులు వాజిద్ మరణంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Next Story