సీనియ‌ర్ న‌టి వాణిశ్రీ త‌న‌యుడు హఠాన్మరణం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 May 2020 6:48 AM GMT
సీనియ‌ర్ న‌టి వాణిశ్రీ త‌న‌యుడు హఠాన్మరణం

అల‌నాటి హీరోయిన్‌, సీనియర్‌ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. వాణిశ్రీ త‌న‌యుడు అభినయ్‌ వెంకటేష్‌ కార్తీక్‌ (36) గుండెపోటుతో మృతి చెందాడు. శుక్ర‌వారం ఉద‌యం మృతి చెందినా.. విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. చెన్నై అన్నపూర్ణ మెడికల్ కళాశాలలో డాక్టర్‌గా పనిచేస్తున్న అభినయ్.. ‌ప్యాలెస్ పనుల నిమిత్తం గురువారం చెంగల్‌పట్టుకు వెళ్లారు.

ఆ రాత్రి తన కుమారుడితో సరదగా గడిపిన వెంకటేశ్.. ఉద‌యం చూసేస‌రికి మృతి చెందిన‌ట్లు చెందినట్లు సమాచారం. నిద్రలో గుండెపోటు రావడంతో చనిపోయాడ‌ని సన్నిహితులు చెబుతున్నారు. చెన్నైలోని వాణిశ్రీ ఇంటికి అభిన‌య్ మృత‌దేహం తీసుకురావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వాణిశ్రీకి కుమారుడు అభినయ్‌తో పాటు కుమార్తె అనుపమ ఉన్నారు. అభిన‌య్ భార్య కూడా వైద్యురాలే.

అభినయ్ అంత్యక్రియలు నేడు జరుగనున్న‌ట్లు స‌మాచారం. వాణిశ్రీ త‌న‌యుడు మృతి చెందాడ‌న్న వార్త‌తో చిత్రపరిశ్రమ ఒక్క‌సారిగా దిగ్భ్రాంతికి గురైంది. వాణిశ్రీకి పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు త‌మ‌ సానుభూతి తెలిపారు.

Next Story